సాదర ఆహ్వానం !!
Sunday, 22 January 2023
Sunday, 8 January 2023
శ్యామలా నవరాత్రి ఉత్సవాలు-2023
*శ్రీ శ్యామలా నవరాత్రుల పత్రిక ఆవిష్కరణ*.
మహారాష్ట్ర నుండి పూజ్య విద్యారణ్య స్వామీజి కరకమలములచే Virutal గా
మహారాష్ట్ర నుండి పూజ్య విద్యారణ్య స్వామీజి
కరకమలములచే virutal గా..
విద్యార్థుల వికాసం కోసం- విద్యార్థుల బాగస్వామ్యoతో....
*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం*
(ఆలయం చిన్నది-ఆశయం గొప్పది)
*నందివనపర్తి, యాచారం, రoగారెడ్డి జిల్లా*..
*శ్రీమాత్రే నమః*
*శ్రీ శ్యామలా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభోత్సవం-2023.*
హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి.
అవి
1. చైత్ర మాసం లో వసంత నవరాత్రులు
2.ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు
3.ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు
4.మాఘ మాసంలో శ్యామలా లేదా మాతంగి నవరాత్రులు.
వారాహి మరియు శ్యామలా నవరాత్రుల ను గుప్త నవరాత్రులు అంటారు.
ఉత్తర భారతదేశంలో చాలా దేవాలయాల్లో జరుపుతారు.
*శ్యామలా నవరాత్రులు*:
ప్రతి సంవత్సరం *మాఘ శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు శ్యామల నవరాత్రులని జరపాలని దేవీ భాగవత మహిమ మానస ఉత్తరఖండ సూద పురాణంలో ప్రస్తావించ బడింది.*
*శ్యామలా దేవి తిరుగాడుతూ ఉండే ఈ విశేష రోజుల్లో చేసే పూజల వల్ల ముఖ్యంగా విద్యార్థులకు అపారమైన జ్ఞాపకశక్తి, సద్భుద్ది కటాక్షిస్తుంది*.
*సమాజ హితాన్ని కాంక్షిస్తూ చేసే పనికి లక్షరెట్లు తోడ్పాటు అంది అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది కుటుంబ వృద్ది జరుగుతుంది. దశ మహా విద్యల్లో మాతంగినిగా ఈ అమ్మవారిని పూజిస్తారు.*
*శ్రీ చక్రంలో సప్తావరనాత్మకమైన గేయచక్రం లో కొలువై ఉంటుంది ఈ అమ్మవారు*.
*అమ్మవారి అవతారాలు:*
1..లఘు శ్యామల
2 వాగ్వాధిని శ్యామల
3.నకుల శ్యామల
4..హసంతి శ్యామల
5.సర్వసిద్ది మాతంగి
6.వాస్య మాతంగి
7. సారిక శ్యామల
8.సుఖ శ్యామల
9.రాజ మాతంగి/ రాజ శ్యామల
పూజా విధానం:
నిత్య పూజ తో పాటు అమ్మవారిని మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడస నామాలతో పాటు (హృదయం, కవచం, సహస్ర నామావళి, దేవి ఖద్గమాల), కుంకుమార్చన చేయాలి. అమ్మవారికి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీరలను మాత్రమే ధరింప చేస్తూ రోజూ ప్రసాదంగా పాయసం నివేదించాలి.
*రాజ మాతంగి హోమం చండీ సహిత రుద్రహోమం, మాతంగి చండీ హోమం శ్రీ చక్ర ఉపాసన వేద పండితులు శాస్త్ర బద్దం గా జరిపిస్తారు*. దేవాలయంలో గుప్తంగా ఈ పూజలు జరుపుకోవడం వల్ల గుప్త నవరాత్రులు అని పేరు.
*ఆలయాల ఉత్సవాలలో నూతన ఒరవడి తో విద్యార్థుల భాగస్వామ్యంతో శారద నవరాత్రి ఉత్సవాలు-2023.*
*విద్యార్థుల వికాసం కోసం_విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందినాథ క్షేత్రంలో శ్రీశ్రీశ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో మొట్టమొదటి సారిగా శ్యామలా నవరాత్రి ఉత్సవాలను ఈ 2023 సంవత్సరం నుండి నిర్వహించ సంకల్పించారు దేవాలయ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు.*
మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే! జయ లీలా శుకప్రియే//
*ఆ శారదా దేవి సన్నిధిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని కాంక్షిస్తూ పరిసర ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల భాగస్వామ్యంతోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించారు.*
అందులో భాగంగా *2023 జనవరి 22 నుండి 30 వరకు పిల్లల పండుగగా ...కన్నుల పండుగగా...ఉత్సవాలు నిర్వహించ బడతాయి*.
*నందినాథ క్షేత్ర పరిసర ప్రాంతంలోని 108 విద్యాసంస్థలకు శ్రీ శ్యామలా నవరాత్రులకు ఆహ్వానించబడతుoది*
*అన్ని స్థాయిల విద్యార్థులకు (@ KG to PG) ప్రత్యేక దర్శన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు/ప్రదర్శనకు జ్ఞానసరస్వతి సేవాసమితి అవకాశం కల్పిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా *exam pads*, *pen* మరియు *ఇతర విద్యార్థులకు *pen* అమ్మవారి ప్రసాదంగా అందజేయబడుతాయి.
*విశేషంగా వసంతపంచమి- జనవరి, 26 రోజున చిన్నారులకు పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే అక్షరాభ్యాసం మరియు విద్యార్థులచే మహా సరస్వతి హోమం నిర్వహణ*.
*విశేషంగా రథసప్తమి 28/01/2022 రోజున విద్యార్థులతో ప్రత్యేకంగా శ్రీ మాతంగి చండి సహిత రుద్రహోమం*.జరుగుతుంది.
ఆలయంలో మొట్టమొదటి సారి నిర్వహించబడుచున్న *శ్రీ శ్యామలా నవరాత్రి ఉత్సవాలలో అందరం పాల్గొందాం*. ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సాహద్దాo.
*విద్యార్థుల సాంస్కృతిక కళా ప్రదర్శనలకు ఆలయ సంకల్పభవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కావున దేశభక్తి పాటలు, భగవద్గీత శ్లోకాలు, వేమన/సుమతి శతకాల పద్యాలు, యోగ, కూచిపూడి నృత్యం, తబలా, డోలక్ వంటి అంశాలలో విద్యార్థుల ప్రదర్శనకు ప్రోత్సాహకాలు ఉంటాయి.. విద్యార్థులను గుర్తించి, ప్రోత్సాహిద్దాం*.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్ & *జ్ఞానసరస్వతి సేవా సమితి*
Tuesday, 3 January 2023
సరస్వతిమాత విగ్రహం @KGVP Amangal
శ్రీమాత్రే నమః!!
@ KBVP School, Amangal.
గుణసంపద వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పాడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వళమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో జ్ఞానసరస్వతి దేవాలయం, నoదివనపర్తి కేంద్రంగా #జ్ఞాసరస్వతి సేవాసమితి ద్వారా అందించిన సరస్వతిమాత విగ్రహం మార్గశిర ఏకాదశి 02.01.2023, సోమవారం రోజున ఆవిష్కరణ జరిగింది..
విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి, నూతనంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవం కూడా నిర్వహిoచబడిoది.
ఈ ఉత్సవంలో Girl Child Devolopment Officer(GCDO) శ్రీమతి. ఉషారాణి గారు, Amangal #KBVPSchool SO శ్రీమతి పద్మజ్యోతి గారు, ప్రముఖ రచయిత,ఉపన్యాసకులు శ్రీ #ప్రొద్దుటూరిఎల్లారెడ్డిగారు, జ్ఞానసరస్వతి సేవాసమితి వ్యవస్థాపకులు శ్రీ
#సదావెంకట్ గారు, పాదపూజ నిర్వాహకులు శ్రీ రమేష్ గురూజీ, శృతిలయ డాన్స్ అకాడమి ఇంచార్జ్ చిత్తరంజన్ దాసు, శ్రీ శంకర్ గారు, #గ్రoథాలయ దాత శ్రీ పాపిశెట్టి వెంకటేష్ గారి కుటుంబం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు..
అన్ని స్థాయిల విద్యా సంస్థలకు #చదువులతల్లి, #జ్ఞానప్రధాత శ్రీ సరస్వతి మాత విగ్రహం ఉచితంగా అందివ్వాలన్న ఆశయంతో సాగుతున్న ఈ#విద్యామహాయజ్ఞంలో అందరు బాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
విగ్రహo కావలసిన విద్యాసంస్థలు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు.
(విద్యా సంస్థలకు అన్ని సంస్కారాలను పూర్తి చేసిన సరస్వతి మాత విగ్రహాలు ఉచితంగా అందిస్తారు.
ఇప్పటి వరకు 190 విద్యాసంస్థలకు అందిoచారు.)
Tuesday, 27 December 2022
విద్యార్థుల భాగస్వామ్యంతో శారదా నవరాత్రి ఉత్సవాలు - 2023
విద్యార్థుల వికాసoతో-విద్యార్థుల బాగస్వామ్యంతో...
*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నoదివనపర్తి*.
*విద్యార్థుల భాగస్వామ్యoతో శారద నవరాత్రి ఉత్సవాలు-2023.*
పూజ్య విద్యారణ్య భారతి స్వామీజి దివ్య ఆశీస్సులతో జ్ఞానసరస్వతి దేవాలయంలో మొదటిసారి నిర్వహణ.
ప్రారంభోత్సవ సంవత్సరం 2023, *జనవరి 22నుండి 30వరకు ఈ శారద నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడతాయి*.
ఆలయాల ఉత్సవాల నిర్వహణలో నూతన ఒరవడితో..
*అన్ని స్థాయి విద్యార్థులకు (@ KG to PG) ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక దర్శనం ఉండే విధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు*.
*వ్యవస్థ నిర్వహణలో కూడా పూర్తిగా విద్యార్థులే ఉండేవిధంగా విద్యార్థులను ప్రోత్సాహంచే ప్రయత్నంలో ఈ రోజు పాఠశాల విద్యార్థులకు కార్యక్రమ నిర్వహణ ఉద్దేశ్యం, వారి బాగస్వామ్యం ఉండే విధానం వివరించారు జ్ఞానసరస్వతి సేవాసమితి వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు*.
ఆలయ నిర్మాణంలో విద్యార్థుల బాగస్వామ్యం, గత 2012 సంవత్సరo నుండి వసంత పంచమి నిర్వహణలో 10వ తరగతి విద్యార్థుల బాగస్వామ్యం గురించి వివరంగా తెలుపుతూ..
*చరిత్రలో మొదటిసారి పూర్తిగా విద్యార్థుల నిర్వహణలో, విద్యార్థుల కోసమే *శారద నవరాత్రి ఉత్సవాలు* నిర్వహించడంలో నoదినాథ క్షేత్రంలో ఉన్న విద్యార్థులు, పరిసర గ్రామాల విద్యార్థులు పాల్గొనాలి అని తెలిపారు.
ఉత్సవానికి అవసరమైన పనులను విభాగాలుగా విభజించి, విద్యార్థులచే బృందాలు చేసి నిర్వహణలో వారే ఉండేలా రచన చేస్తున్నది GSS.
*ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి సరస్వతి మాత జన్మతిథి- మాఘశుద్ధ పంచమి రోజున జరిగే సరస్వతి హోమం ఆనవాయితీగా 10వ తరగతి విద్యార్థులచే నిర్వహించడం, అదే విధంగా ఉత్సవ ఊరేగిoపు పూర్తిగా విద్యార్థుల నిర్వహణలో కొనసాగడం జరుగుతున్నది. కొత్త ఒరవడితో, మొదటిసారి నిర్వహిస్తున్న *శారద నవరాత్రి ఉత్సవాలలో* నిర్వహణలో ఉండే విద్యార్థులకు ఆలయ అన్ని మండలీల సభ్యులు సహకారం అందిస్తారు..
Pls Note: *అందరం గమనిద్దాం.. ఏదైనా సాoస్కృతిక అంశాలలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థుల ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి, అలాంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించగలరు*.
సమయానుకూలంగా పూర్తి సమాచారం అందరికీ అందుతుంది.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్* *జ్ఞానసరస్వతి సేవాసమితి*
Wednesday, 30 November 2022
కళాశాల విద్యార్థుల విరాళంకోసం
Activity of 01.12.2015
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
నీ ముంగిట ద్వజస్థంభమే నిలపటానికై....
అమ్మా దీవించు - కదిలాము సేవాదళమై
అడగటానికి మేమైతే సిగ్గుపడటం లేదు..
అనుగ్రహించు వారిని.. ఇచ్చి ఎదగడానికి
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
ద్వజస్థంభమే కాదది స్ఫూర్తికేంద్రమవ్వాలని,
పల్యాణిముత్యాల ఆసరకై శ్రద్దకేంద్రమవ్వాలని..
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
( సంకల్పం... జ్ఞానసరస్వతీ దేవాలయంలో ప్రతిస్థించే ద్వజస్థంభం కళాశాల విద్యార్థుల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం.. 2015 జనవరి, వసంతపంచమి రోజున ప్రతిష్ఠా మహోత్సవం జరపాలని నిర్ణయించబడింది. విరాళాలకోసం కళాశాలకు బయలుదేరే ముందు అమ్మదీవెనలు.. పెద్దల ఆశీస్సులు కోరుతూ ... బయలుదేరుదాం... దీవించు - కదిలాము సేవాదళమై!
కార్యకర్తల సమావేశం @ 01.12.2019.
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన #ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో దేవాలయ వ్యవస్థలో కొనసాగుతున్న #జ్ఞానసరస్వతిసేవాసమితి సభ్యుల
#ఆత్మీయసమావేశం
*జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై...
దేవాలయాల సంకల్పo, నిర్మాణ విధానం పై మరియు రాబోయే కార్యక్రమాలపై వ్యవస్థాపకులు_సదా వెంకట్ గారిచే క్లుప్త వివరణ..
#జ్ఞానసరస్వతిసేవాసమితి అధ్యక్షులు ఐలపురం జలంధర్ రెడ్డి గారిచే దేవాలయ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన వివిధ మండలీల పరిచయం..
దేవాలయ వ్యవస్ధపై ముఖ్య అతిథి -
మాన్యశ్రీ అమర లింగన్న గారి ప్రేరణాత్మకమైన
సందేశంలోని కొన్ని ముఖ్య విషయాలు.
1. సమాజ కార్యక్రమంలో అందరం సమానమే మరియు అందరం కార్యకర్తలమే..
2. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇస్లాం, క్రైస్తవం ద్వారా అనేక రకాల దాడులు జరిగినా, జరుగుతున్నా భారతదేశం ఇంకా హిందు దేశంగా ఇంత పటిష్టం గా ఉండడానికి కాలానుగుణంగా వ్యక్తుల నిర్మాణం చేసారు మన పూర్వులు. ద్ధర్మ స్థాపన కోసం వారి త్యాగం అమోఘం.
3. సంస్కారం పరంగా అందరం సమానమే అది దేవాలయం ద్వారా జరగాలి.
4. సమాజంలో మంచి కోసం ఏమైనా చేయాలనే ఆలోచన చేయాలని అందరిలో రావాలి.
దేవాలయం ద్వారా జరిగే కార్యక్రమాలకు సందపను సమర్పణ చేయడం చాలా గొప్పకార్యం.
5. దేవాలయం కేంద్రంగా వ్యక్తి నిర్మాణం మరియు వ్యవస్థ పటిష్టం జరగాలి.
6. మానవ సంస్కార నిలయాలు అమ్మఒడి, బడి, గుడి ద్వారా అందే సంస్కారం వల్ల వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటాడు.
7.ఇక్కడ జ్ఞానసరస్వతి దేవాలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులను బాగస్థులను చేసే కార్యక్రమాల ద్వారా రేపటి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది.
8.రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది.
అందుకోసం సమయ సమర్పణ చేస్తున్న కార్యకర్తలు ధన్యులు.నేను మీలో ఒక కార్యకర్తను.
సేవాసమితి ద్వారా జరిగే రాబోయే కార్యక్రమాలు..
1. వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేసుకున్న మండలీల పటిష్టం చేయడం.
2. సేవాసమితి నిర్ణయం ప్రకారం జనవరి 29న సంకల్ప భవన్ ప్రారంభం, 30న వసంత పంచమి తో పాటు 3 రోజుల కార్యక్రమాలు..
3. 1008 మంది మాతృమూర్తులు, 108 రోజుల పాటు ప్రతి రోజు పిడికెడు బియ్యం తో అమ్మవారికి #అన్నపూజాకార్యక్రమ..
4. పోషక మండలి పటిష్టం( దేవాలయ నిత్య పూజా కార్యక్రమాలకై సమర్పణ చేస్తున్న వారు)
5. 15 సం. లోపు చిన్నారులకు #సంకల్పభవన్ లో పుట్టిన రోజు వేడుకలు మరియు #బాలసంస్కారకేంద్రo నిర్వహణ.
6. #నిత్యాన్నదాన కార్యక్రమం..
సేవాసమితి సమన్వయ మండలి సభ్యులచే మాన్యశ్రీ అమర లింగన్న గారికి సన్మానం..
భజన మండలి సబ్యులకు చిరు సన్మానం.
#వందనసమర్పణ తో పూర్తి.
Subscribe to:
Posts (Atom)