Tuesday, 22 June 2021

సేవే సంకల్పం Article

 పదకొండేoడ్ల కింది విషయం. 
 అప్పుడప్పుడే ఆశయాన్ని అర్ధం చేసుకుని ఆదరణ ప్రారంభమయిన సమయం...  2010లో ఈనాడు వ్యాసం ఇది..  
అప్పటికే గుడి పనికి_ బడిపనికి స్పష్టమైన విదివిదానాలు ఉన్నాయి... రెండు వేరువేరు trusts.రెంటికీ వేరు వేరు పనులు. రెండిoటికి teams వేరు వేరు...   అయినా ఇంకా ఇప్పటికీ కొందరికి అర్థం కాలేదు...  అన్నీ కలిపి కలకూర కంపలాగా చేస్తారు😀😀..

Friday, 18 June 2021

జన్మదిన శుభాకాంక్షలు

*దేశం బాగుండాలి అంటే ఊర్లు బాగుండాలి.. ఊర్లు బాగుండాలి అంటే ఊర్లో గుడి, బడి బాగుండాలి అని నమ్మి*

*ఊరి కోసం దేశం కోసం తన జీవితాన్ని సమర్పించిన ధన్యజీవి...*

ఎంతోమంది యువకులకు మార్గ నిర్దేశం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్ముడు...
నమ్మిన సిద్దాంతం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లే వీరుడు..  

దేశం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు ..

*తానొక్కడే కాకుండా తనతో పాటు వందలాది కార్యకర్తలను తయారు చేసిన కార్యోన్ముుకుడు...*

*పుట్టింది తన కోసం కాదు సమాజం కోసం..*

కాలం తయారు చేసుకున్న కారణ జన్మునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు,  సేవా కార్యక్రమాలకు నిలయాలు*  అన్నీ కలిపి *ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో    *దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే మహాసంకల్పంతో.*జ్ఞాన సరస్వతి సేవా సేవాసంస్థలు ప్రారంభించి @ (జ్ఞాన సరస్వతి సేవాసమితి ట్రస్ట్, జ్ఞానసరస్వతి సంస్థాన్ మరియు జ్ఞానసరస్వతి పౌండేషన్) వాటి తరఫున* సమాజ హితంకోసం నిరంతర సేవలో కొనసాగుతున్న
*సదా వెంకట్* గారికి సేవాసంస్థల తరపున జన్మదిన శుభాకాంక్షలు...

Tuesday, 8 June 2021

ఆలయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం మరియు నూతన దేవాతా వాహనాల ప్రతిష్టా కార్యక్రమాలు సంపూర్ణం.

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*..


ఆలయ శ్రేయోభిలాషులందరికీ శుభాబినందనలు, శుభాకాంక్షలు...

*ఆలయ పుష్కర కుంభాబిషేక మహోత్సవం  మరియూ నూతవ దేవతా వాహనాల ప్రతిష్ట కార్యక్రమాలు  సంపూర్ణమయినాయి*..

*ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రత్యక్షంగా బాగస్తులయిన సేవాసమితి సభ్యులకు, సహకరించిన వారికి మనందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు*.

ఆలయ శ్రేయోభిలాషులు, భక్తుల ఆగమనంలో ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న పుష్కర కుంభాబిషేక మహోత్సవం ఈ కరోనా మహమ్మారి కారణంగా కుదించబడిoది.
  వ్యవస్థలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అతి కొద్దిమందితో ఈ ఉత్సవాలు పూర్తయినాయి..  
*అమ్మవారి అనుగ్రహం, పూజ్య విద్యారణ్య స్వామీజి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు ఉన్నకొద్దిలో చాలా బగా నిర్వహించబడ్డాయి*.
 సమయానుకూలంగా ఆలయ శ్రేయోభిలాషులకు ఉత్సవ సంబందిత వీడియోలు అందుతాయి...

*అలయ నిర్మాణానికి, నిర్వహణకు సహకరిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులకు, పోషక మండకి సభ్యులకు ప్రత్యేక శుభాబినందనలు*..

*సమయ సమర్పణలో ఆలయ నిర్మాణ, నిర్వహణ పనుల్లో  నిస్వార్థంగా నిరంతర సేవలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు మనందరి తరవున శుభాభినందలు*..

*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు,  సేవా కార్యక్రమాలకు నిలయాలు*.. 
అన్నీ కలిపి ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో *ఈ దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది*. త్వరలో అన్ని విషయాలు తెలుపబడుతాయు.  అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం...

*కృతజ్ఞతాపూర్వక దాన్యవాదాలతో*...

*సదా వెంకట్*,
*ఫౌండర్, జ్ఞానసరస్వతి సేవాసమితి & జ్ఞానసరస్వతి సంస్థాన్*.

Thursday, 8 November 2018

శ్రేయోభిలాషుల సలహాలు_ Appeal to Well Wishers

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

ఆలయ శ్రేయోభిలాషుల సలహాలు కోరుతూ...

విద్యార్థుల వికాసం కోసం_విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమై, అబివృద్ది చెందుతూ నిరంతర సేవాకార్యక్రమాలతో నిత్యచైతన్య కేంద్రంగా విరాజిల్లుతుంది జ్ఞానసరస్వతి దేవాలయం.

మున్ముందు అమ్మవారి అనుగ్రహంతో, ఎక్కువ శక్తితో తన పరిదిని విస్తృత పరుచుకోవాలని ఆశిద్దాం.

మంచి ఆలోచనతో, మంచి ఒరవడికి నాంది పలుకుతూ..
రెండు విశిష్ట  కార్యక్రమాలను ఆలయం ద్వారా గొప్పగా నిర్వహించాలని ఆశిస్తూ.. అందరి సలహాలు కోరుతుంది సేవాసమితి.

1. అక్షరాబ్యాస మహోత్సవం :: అక్షర శ్రీకారం జరిగిన రోజే ఆ చిన్నారి ఎదుగుదలకు సంకల్పం జరగాలనే  తల్లిదండ్రుల, బంధుమిత్రల ఆకాంక్షకు అనుగుణంగా జరిగే వేడుకకు మన ఆలయం వేదిక కావాలని ఆశిస్తున్నాం.
కావున,  అక్షరాబ్యాస కార్యక్రమ నిర్వహణ జరిగే విధానం పై మీకు ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు ఆలయం వారికి తెలపగలరు. 

2 .ఆయుష్మాన్ భవ::    పుట్టినరోజు వేడుక::

పెద్దల చెప్పినట్టుగా మొక్కై వంగనిది, మ్రానై వంగదు..

15 సం.రాల లోపు పిల్లలకు అందిన సంస్కారాలు, సంకల్పాలు వారు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి.

ఏ తారతమ్యాలు చూపక,
5 సం.రాల నుండి 15 సం.రాల వయసులో ఉన్న చిన్నారుల పుట్టినరోజు వేడుకను
"ఆయుష్మాన్ భవ" అనే కార్యక్రమం ద్వారా నిర్వహించి, వారు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదిస్తూ , వారిచే సంకల్పాన్ని చేయించే వేడుకకు  వేదికగా మన ఆలయం నిలవాలని ఆశిస్తున్నాం.

కావున ఈ రెండు ఉత్సవాల నిర్వహణకు ఉపయోగపడే ఆలోచనలు, ఆభిప్రాయాలు తెలుపగలరు.
అన్ని అభిప్రాయాలు, ఆలోచనలు సమీక్షించి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజి ఆశీస్సులతో,
ఒక చక్కటి  ప్రణాళికతో  ఆ రెండు ఉత్సవాలను సామూహిక ఉత్సవాలుగా నిర్వహిద్దాం_ సామాజిక చైతన్యాన్ని  చాటుదాం.  

:~ జ్ఞానసరస్వతి సేవాసమితి,

Tuesday, 6 November 2018

Elections Time _GSS team

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

""సేవాసమితి సబ్యులందరికి సూచనలు".

మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో నిర్మితమైనది మన ఆలయమని  మనందరికీ తెలిసిందే.

అమ్మవారి అనుగ్రహం, శ్రీ విద్యారణ్య  స్వామీజి దిశ్య ఆశీస్సులతో   ఆలయ నిర్మాణం జరిగిన నాటి  నుండి తమ పరిదిలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నది సేవాసమితి.

ఎన్నికల సమయం...రాజకీయాలు..విఐపి వ్యవస్థ

ఆద్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలు అందరికీ అందుబాటులో ఉండాలి, అక్కడ ఎలాంటి తారతమ్యాలకు, రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదనే నియమాన్ని పాటిస్తుంది జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.

ఇప్పుడు ఎన్నికల సమయం.. 


కావున ఆలయ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న వివిధ మండలీల సబ్యులందరం గుర్తెరిగి పని చేయాలి.

ఒక వ్యక్తికి గాని,  ఒక కుటుంబానికి గాని, ఒక సామాజిక వర్గానికి గాని లేదా ఒక రాజకీయ పార్టీకి గాని  ""దేవాలయం తరపున"  లేదా "సేవాసమితి  తరపున ప్రత్యేకించి మద్దతు ఉండదు".

ఆలయంలోని వివిద వ్యవస్థలలో, మండలీలలో ఉన్న వ్యక్తులు వారి అనుకూలతను బట్టి వ్యక్తిగతంగా ఎవరికైనా పని చేసుకోవచ్చు.... ఎవరికైనా మద్దతు తెలుపొచ్చు.

""ఆ దేవుడి ముందు ఏ స్తాయి వ్యక్తులైన, వ్యవస్థలైనా సమానమే""

.
ఆలయానికి వచ్చి ఆశీర్వాదం తీసుకునే వారందరికీ స్వాగతమే......
వారి వారి నిజాయితీని బట్టీ  అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది మన విశ్వాసం.

కావున "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ ద్వారా వివిద మండలీలలో, వ్యవస్థలో ఉన్న సబ్యులందరం   ఈ ఎన్నికల సమయంలో   ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. వ్యక్తుల ద్వారా వ్యవస్తకు పరిపుష్టత రావాలి కానీ నష్టం జరగరాదు అనే విషయాన్ని మననం చేసుకుంటూ పనిలో బాగస్టులం కావాలి.


సదా వెంకట్,

Founder & Managing Trustee.

జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.

Thursday, 1 November 2018

అభ్యర్థన @పోషకమండలి _ Appeal to Support

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

         శ్రీ మాత్రే నమ:

ఆలయ నిర్వహణలో అందరి భాగస్వామ్యం ఆశిస్తూ💐....
  
ఆలయ శ్రేయోభిలాషులకు విన్నపం🤝.

మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయంతో నిర్మితమైన ""మన జ్ఞానసరస్వతి దేవాలయం"" నిత్య పూజలతో, ఉత్సవాలతో మరియు సేవాకార్యక్రమాలతో నిరంతర మహాయజ్ఞంలా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే..

సంకల్పానుసారం అలయ నిర్వహణలో ""అన్ని సేవలు ఉచితంగా"(రుసుము లేకుండా) నిర్వహించ బడుతున్నాయి.
అర్చనలు, అక్షరాబ్యాసం మరియు ఆలయంలో నిర్వహించే అన్ని కార్యాలకు "ఎలాంటి రుసుము లేదు". అన్నీ ఉచిత సేవలే..

""దైవ అనుగ్రహం అడుక్కోవాలి_కొనుక్కోరాదు" అని సనాతన ధర్మం చెప్పింది🙏.
పూర్వపు రోజుల్లో "పోషకులు" మనస్ఫూర్తిగా సమర్పణ చేసే విరాలాలతోనే ఆలయాలు నిర్వహించబడేవి. అందుకే నిత్యచైతన్య కేంద్రాలుగా విలసిల్లినవి👍. ఆ పరoపరను పునర్జీవింప చేయాలనేది మన ఆలయ ఉద్దేశ్యం.

  మన ఆలయంలో కూడా భక్తులు మనస్పూర్తిగా సహకరించిన వాటితో ఆలయ నిర్వహణ, కార్యక్రమాలు మరియు అభివృద్ది పనులు జరుగుతున్నాయి✊.

**అలయ నిర్వహణలో భాగస్వామ్యo ఆశిస్తూ అభ్యర్ధన/అవకాశం.

ఆలయ ప్రారంభం నుండి నేటి వరకు కొంతమంది సభ్యుల సహకారంతో ""ప్రతినెలా నిర్వహణ"" జరుగుతుంది.

అమ్మవారి అనుగ్రహముతో🙏
ఇప్పుడు ఆలయానికి భక్తుల సందర్శన పెరగడంతో పాటు, నిర్వహణ స్థాయి పెరిగింది.
దూర ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు, అక్షరాబ్యానికి వచ్చే కుటుంభాలకు వసతులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

వచ్చే భక్తులకు ఏర్పాట్లతో పాటు, ఆలయంలో ఒక "వేద పండితుడైన పూజారి" ని ఏర్పాటు చేయాలని సేవాసమితి నిర్ణయించింది.

పూజారి గౌరవ వేతనంతో పాటు, నెలవారి ఖర్చులలో ఎక్కువ మందికి బాగస్వామ్యం కలిపించాలని సేవాసమితి ఉద్దేశ్యం.

కావున ఆలయ నిర్వహణలో భాగస్తులు కావాలని కోరుతూ, తారతమ్యాలు మరిచి అందరినీ అభ్యర్తిస్తుంది జ్ఞానసరస్వతి సేవాసమితి.

తమ తమ అనుకూలతను బట్టి ప్రతీ నెలా ధనరూపేన రూ.501/౼ 1001/౼, ఆపై గాని లేదా
ఆలయ నిర్వహణకు వస్తురూపేన సమర్పించి ఆలయ నిర్వహణలో భాగస్తులు కాగలరు🤝.

✊ఆలయం మనదే_బాధ్యతా మనదే✊:

బోలో సరస్వతీ మాతాకి  జై🙏

వివరాలకు సంప్రదించగలరు: శివకుమార్_9885920685.

~: జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.

Thursday, 13 September 2018

FIRST SALARY #DoNaTioN

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  చదువులతల్లికి హ్రుదయ నీరాజనం..

నందివనపర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ పొలొజు పుల్లచారి పెద్దకోడలు శ్రీ లక్ష్మినరసింహా చారి గారి భార్య శ్రీమతి పుష్పవతి గారు ఈ మధ్య వచిన గురుకుల ఉద్యోగాలలో  పి.జి.టి గా ఉద్యోగం పొందారు.
తన మొదటి 2 నెలల వేతనాన్ని అలయానికి సమర్పించారు.

ఆమె మాటల్లో......

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడూ కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న                శ్రీ జ్ఞానసరస్వతిమాతకు మొక్కుకున్నాను.నా  కృషికి అమ్మవారి అనుగ్రహం తోడై ఈ ఉద్యోగం లభించిండి. అందున నిత్యం ఆ అమ్మవారి అనుగ్రహంతో పిల్లలకు బొదించే పవిత్ర వ్రుత్తిలో ఉద్యోగం పొందడం ఇంకా ఆనందాన్నిస్తుంది. ఇక్కడి ఆలయ నిర్మాణ సంకల్పం మరియు ఆలయం ద్వారా నిరంతరంగా కొనసాగుతున్న విద్యామహయజ్ఞానికి నేను సైతం తోడవ్వాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ "" నా మొదటి 2 నెలల వేతనాన్ని(65,280/)"" హ్రుదయపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇందుకోసం  నన్ను ప్రొత్సహించిన మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..

కృషి పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన 2 నెలల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన శ్రీమతి పుష్పలత గారికి జ్ఞానసరస్వతి సేవాసమితి  తరపున శుభాభినందనలు ..

పుష్పలత గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతురాలు కావలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..

#GNANA SARASWATHI SEVASAMITHI Trust.