*విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం* నందివనపర్తి.
*విషయం చిన్నదే అయినా.. పవిత్రమైనది, శక్తివంతమైనది.. చరిత్ర లో నిలిచేది.*
*అమ్మవారికి హంస వాహనం (రథం)* కోసం
*10 వేల మంది పైగా చిన్నారులను (పాఠశాల విద్యార్థులు) భాగస్తులను చేసే మరో అద్భుత కార్యానికి జ్ఞానసరస్వతి సంస్థాన్ ద్వారా నిర్ణయం జరిగింది.*
నందినాథ క్షేత్రానికి 50kms పరిధిలోని అన్ని రకాల పాఠశాలను సందర్శించి, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల సమన్వయంతో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో జ్ఞానసరస్వతి సంస్థాన్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. సంస్థాన్ తరపున పాఠశాలకు వెళ్ళాలిన బృందాలకు సంకల్ప భవన్ లో సంస్థాన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు Orientation నిర్వహించారు..
*అమ్మవారికి హంస వాహనం* కోసం 6 నుండి 10వ తరగతి విద్యార్థులు
*రోజూ శ్లోకం - రోజుకో రూపాయి* అనే నినాదం తో 108 రోజుల పాటు విద్యార్థులు పొదుపు చేసి అందించిన విరాళాలతో మాత్రమే అమ్మవారికి *హంస వాహనం(రథం)* సమకూర్చుతామని తెలిపారు.
అదేవిధంగా ప్రతీ నెలా విద్యార్థులతో నిర్వహించే మూలా నక్షత్రం హోమంలో పాల్గొనేలా ఆయా విద్యాసంస్థలను ఆహ్వానిస్తారు,
అడిగిన విద్యాసంస్థలకు సరస్వతి మాత విగ్రహం ఉచితంగా ఆలయం తరపున అందిస్తామనే విషయాలు సంస్థాన్ తరపున హంస వాహన బృందాలు విద్యాసంస్థలకు తెలియజేస్తాయి.
ఈ మహా కార్యం ద్వారా విద్యార్థులకు చిన్నతనంలోనే సమాజ కార్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం, పొదుపు చేసే గుణం, సమర్పణ భావనతో పాటు క్రమ శిక్షణ అలవడుతాయని సదా వెంకట్ గారు తెలిపారు.
సుమారు 108 మందితో 10 బృందాలు, 10 మండలాల్లో కనీసం 108 విద్యాసంస్థలను ఆగస్టు / సెప్టెంబర్ మాసాలలో కలిచేలా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కావున ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను, విద్యార్థుల తల్లి దండ్రులను ఈ మహా కార్యంలో తమ పిల్లలను పాల్గొనేలా ప్రోత్సహించాలని సంస్థాన్ తరపున అభ్యర్థన చేశారు.