Sunday, 14 July 2024

మాతృమండలి సమావేశం

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి,
*సమన్వయ మండలి సభ్యుల సమావేశం*

*చర్చించిన అంశాలు*

*ఆగస్టు 15 లోగా అన్ని మండలీల సమావేశాలు విడివిడిగా పూర్తి చేసేలా ప్రయత్నం*.

*మూల నక్షత్ర హోమం*  పై ప్రత్యేక శ్రద్ధతో ప్రయత్నాలు.

1. ప్రతి నెల జరిగే మూల నక్షత్ర హోమం రోజున, ఆలయానికి చెందిన ఒక మండలీ సభ్యులను ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ..

2.నందినాథ క్షేత్ర పరిధిలోని వివిధ  పాఠశాలల్లోని విద్యార్థులను మూల నక్షత్ర హోమంలో భాగస్వామ్యం చేయడం.

3.మూల నక్షత్ర హోమం రోజున అన్న ప్రసాదం ఏర్పాటు.

*దేవి శరన్నవరాత్రులు-2024*

1.ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు విశేషంగా జరిగే చండి హోమం లో పాల్గొనేలా (లేదా) అమ్మవారి దర్శనం చేసుకునేలా విశేష ప్రయత్నం.

2.దేవి శరన్నవరాత్రుల నిర్వహణ కోసం 18 మంది సభ్యులతో  *ఉత్సవ నిర్వహణ మండలి-2024* ఏర్పాటు.

3.నందినాథ క్షేత్రంలోని ప్రతి కుటుంబం నుండి కనీసం  ఒక  శరన్నవరాత్రుల్లో భాగస్వామ్యం చేయడం.

4.సమన్వయ మండలి సభ్యులకు శరన్నవరాత్రుల్లో విశేషంగా జరిగే కార్యక్రమాలకు విడివిడిగా ఏర్పాట్లు చేసేలా ప్రయత్నం.

*అమ్మవారికి హంసవాహనం*

1. క్షేత్ర పరిధిలోని 50 కి. మీ పరిధిలోని పాఠశాలను మండలాల వారిగా విభజించి, ఆ పాఠశాలలకు ప్రత్యక్షంగా వెళ్ళి *పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాలతో అమ్మవారికి హంస వాహనం & ఆభరణాలు* కార్యక్రమం గురించి వివరించడం.

ఆలయం ద్వారా ఇప్పటి  వరకు ఇచ్చిన సుమారు 200
విగ్రహాలను విద్యాసంస్థల్లో ప్రతిష్టించిన విషయం విదితమే. ఆ విద్యాసంస్థల సభ్యులతో Virtual పద్ధతిలో సమావేశం ఏర్పాటు చేసి *అమ్మవారికి హంసవాహనం* కార్యక్రమం గురించి అవగాహన కల్పించి, వారి పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయడం.

*మున్ముందు ప్రారంభించే కార్యక్రమాలు కోసం ప్రయత్నం*

1. 14. సం. లోపు చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు 

2. తల్లిదండ్రులకు పాదపూజ 

3. ఆలయం కేంద్రంగా అవసరార్థులకు వైద్య సహాయం.

4. బాల సేవక మండలి ఏర్పాటు మరియు బాల సంస్కార కేంద్ర నిర్వహణ.

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*