Friday, 28 June 2024

మొక్కు చెల్లించడం సనాతనం.. అది ధర్మంలో భాగం. అదో ఆచారం.. ఆనవాయితీ.

*మొక్కు చెల్లించడం సనాతనo.. అది ధర్మంలో బాగం,  అదో ఆచారం, ఆనవాయితీ*.

జ్ఞానసరస్వతి దేవాలయ శ్రేయోభిలాషులoదరికి శుభవార్త...

సంకల్పం సాకారమైన ఏడేళ్ల తరువాత మొక్కు చెల్లింపు. అది సామాజిక బాద్యత.. భగవంతునిపై అపార విశ్వాస ప్రదర్శన.

గుణ సంపద వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవాలి అనే ఆశయ స్ఫూర్తితో...అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువులతల్లి, జ్ఞాన ప్రధాత శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఉండాలని సంకల్పించి 2018 జనవరిలో 3 రోజుల శ్రీ సరస్వతీ మహాయజ్ఞం నిర్వహించిన విషయం అందరికీ విదితమే..

పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో,  అందరి సమన్వయ సహకారంతో ఎంత అద్భుతంగా జరిగిందో మనందరికి తెలిసిందే.
అది సామాజిక ఉద్యమంగా నిరతంరం కొనసాగుతున్నది.
కానీ ఆ మహాయజ్ఞం కోసం జరిగిన పూర్వ ప్రయత్నాలు అందరికీ తెలియక పోవచ్చును. అందునా దైవ అనుగ్రహం, ప్రకృతి సహకారం లేకుండా అలాoటి కార్యాలు మనలాంటి సామాన్యుల ద్వారా సాధ్యం కావు..
ఆ మహాయజ్ఞం నిర్వహణ కోసం అవసరమైన పైసలు, కావాల్సినoత పరపతి లేకున్నా, జరగాల్సిన కార్యం అద్భుతంగా జరిగిoదoటే అది ఖచ్చితంగా దైవ అనుగ్రహమే.

అలాంటి అనుగ్రహం పొoదిన మనం అదృష్టవంతులo..

అనామకులమైన మనలాంటి వారి ద్వారా జరిగిన సంకల్పానికి అనుగ్రహం ఇవ్వాలని 2017 సంవత్సరంలో కాశ్మీర్ లోని శ్రీ జ్యేష్ఠమాతక ఆలయం సందర్శించి, మహాయజ్ఞం విజయవంతoగా జరిగితే తిరిగి ఆలయానికి వచ్చి నివేదన సమర్పిస్థానని మొక్కడం జరిగింది..

అమ్మవారి అనుగ్రహoతో శ్రీ సరస్వతీ మహాయజ్ఞం అద్భుతంగా జరిగింది..
కానీ మొక్కు తీర్చుకోవడం మిగిలింది. మన సనాతన ధర్మంలో మొక్కుకు ఉన్న శక్తి మనoదరికి తెలిసిందే..అది తీర్చుకోవడo మన బాద్యత, అదృష్టం కూడా..
కావున  *కార్యం జరిగిన ఏడేళ్ల తరువాత, ఈ రోజున @ 28.06.2024 అఖండ భారత్ దర్శన్ యాత్ర బృందo తోడుగా అమ్మవారికి మొక్కు తీర్చుకునే భాగ్యం దక్కింది*.
 మన భారం దిగింది. భవిష్యత్ కార్యాలకు కావాల్సిన శక్తిని ప్రసాదించ వలసిoదిగా ప్రార్ధిద్దాo.

*ఇది వ్యక్తిగత  కోరిక కాదు, వ్యక్తిగత కార్యమూ కాదు, ఇది సామాజిక కార్యం....ఇదొక ఆద్యాత్మికతో కూడిన సామాజిక ఉద్యమం*.  

*కావున ఆ కార్యంతో అనుబంధం ఉన్న అందరికీ తెలపాలని ఉద్ధేశ్యంతో తెలిప బడుతున్నది.*

 ఈ కార్యంలో నాతో కలిసి పనిచేసిన  సహచరులందరికి, *ఈ జ్యేష్ఠాదేవి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులo కావడానికి సహకరించిన అఖండ భారత్ దర్శన్ యాత్ర మిత్ర బృందానికి ధన్యవాదాలు*.

భవధీయ 
సదా వెంకట్,
Founder & Managing Trustee,
GNANA SARASWATI SAMSTHAN.