Tuesday, 27 December 2022

విద్యార్థుల భాగస్వామ్యంతో శారదా నవరాత్రి ఉత్సవాలు - 2023


విద్యార్థుల వికాసoతో-విద్యార్థుల బాగస్వామ్యంతో...

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నoదివనపర్తి*.


*విద్యార్థుల భాగస్వామ్యoతో శారద నవరాత్రి ఉత్సవాలు-2023.*

 పూజ్య విద్యారణ్య భారతి స్వామీజి దివ్య ఆశీస్సులతో జ్ఞానసరస్వతి దేవాలయంలో మొదటిసారి నిర్వహణ.

 ప్రారంభోత్సవ సంవత్సరం 2023, *జనవరి 22నుండి 30వరకు ఈ శారద నవరాత్రి ఉత్సవాలు నిర్వహించబడతాయి*.

ఆలయాల ఉత్సవాల నిర్వహణలో నూతన ఒరవడితో..
*అన్ని స్థాయి విద్యార్థులకు  (@ KG to PG) ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక దర్శనం ఉండే విధంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు*.

*వ్యవస్థ నిర్వహణలో కూడా పూర్తిగా విద్యార్థులే  ఉండేవిధంగా విద్యార్థులను ప్రోత్సాహంచే ప్రయత్నంలో ఈ రోజు  పాఠశాల విద్యార్థులకు కార్యక్రమ నిర్వహణ ఉద్దేశ్యం, వారి బాగస్వామ్యం ఉండే విధానం వివరించారు జ్ఞానసరస్వతి సేవాసమితి వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు*.

  ఆలయ నిర్మాణంలో విద్యార్థుల బాగస్వామ్యం, గత 2012 సంవత్సరo నుండి వసంత పంచమి నిర్వహణలో 10వ తరగతి విద్యార్థుల బాగస్వామ్యం గురించి వివరంగా తెలుపుతూ..

*చరిత్రలో మొదటిసారి పూర్తిగా విద్యార్థుల నిర్వహణలో, విద్యార్థుల కోసమే *శారద నవరాత్రి ఉత్సవాలు* నిర్వహించడంలో నoదినాథ క్షేత్రంలో ఉన్న విద్యార్థులు, పరిసర గ్రామాల విద్యార్థులు పాల్గొనాలి అని తెలిపారు.
ఉత్సవానికి అవసరమైన పనులను విభాగాలుగా విభజించి, విద్యార్థులచే బృందాలు చేసి నిర్వహణలో వారే ఉండేలా రచన చేస్తున్నది GSS.
 *ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి  సరస్వతి మాత జన్మతిథి- మాఘశుద్ధ పంచమి రోజున జరిగే సరస్వతి హోమం ఆనవాయితీగా 10వ తరగతి విద్యార్థులచే నిర్వహించడం, అదే విధంగా ఉత్సవ ఊరేగిoపు పూర్తిగా విద్యార్థుల నిర్వహణలో కొనసాగడం జరుగుతున్నది.       కొత్త ఒరవడితో, మొదటిసారి నిర్వహిస్తున్న *శారద నవరాత్రి ఉత్సవాలలో* నిర్వహణలో ఉండే విద్యార్థులకు ఆలయ అన్ని మండలీల సభ్యులు సహకారం అందిస్తారు..

 Pls Note:  *అందరం గమనిద్దాం..        ఏదైనా సాoస్కృతిక అంశాలలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థుల ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి, అలాంటి విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించగలరు*.

సమయానుకూలంగా పూర్తి సమాచారం అందరికీ అందుతుంది.

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*  *జ్ఞానసరస్వతి సేవాసమితి*