కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువులతల్లికి హ్రుదయ నీరాజనం..
నందివనపర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ పొలొజు పుల్లచారి పెద్దకోడలు శ్రీ లక్ష్మినరసింహా చారి గారి భార్య శ్రీమతి పుష్పవతి గారు ఈ మధ్య వచిన గురుకుల ఉద్యోగాలలో పి.జి.టి గా ఉద్యోగం పొందారు.
తన మొదటి 2 నెలల వేతనాన్ని అలయానికి సమర్పించారు.
ఆమె మాటల్లో......
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడూ కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న శ్రీ జ్ఞానసరస్వతిమాతకు మొక్కుకున్నాను.నా కృషికి అమ్మవారి అనుగ్రహం తోడై ఈ ఉద్యోగం లభించిండి. అందున నిత్యం ఆ అమ్మవారి అనుగ్రహంతో పిల్లలకు బొదించే పవిత్ర వ్రుత్తిలో ఉద్యోగం పొందడం ఇంకా ఆనందాన్నిస్తుంది. ఇక్కడి ఆలయ నిర్మాణ సంకల్పం మరియు ఆలయం ద్వారా నిరంతరంగా కొనసాగుతున్న విద్యామహయజ్ఞానికి నేను సైతం తోడవ్వాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ "" నా మొదటి 2 నెలల వేతనాన్ని(65,280/)"" హ్రుదయపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇందుకోసం నన్ను ప్రొత్సహించిన మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..
కృషి పట్టుదలతో చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన 2 నెలల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన శ్రీమతి పుష్పలత గారికి జ్ఞానసరస్వతి సేవాసమితి తరపున శుభాభినందనలు ..
పుష్పలత గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతురాలు కావలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
#GNANA SARASWATHI SEVASAMITHI Trust.