Friday, 29 June 2018

AnnaPoorna Mandapam

జ్ఞానసరస్వతి దేవాలయ శ్రేయోభిలాషులకు శుభవార్త..

ఆలయ భవిష్యత్తు కార్యక్రమ అవుసరాల దృష్ట్యా @అన్నపూర్ణ మండపం మరియు ఇతర వసతులకోసం ఆలయ సమీపంలో 1100 గజాల స్థలాన్ని ""ఐలపురం జలెందర్ రెడ్డి"" గారు
విరాళంగా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

ఆ స్థలానికి ఆనుకొని ఉన్న సుమారు 580 గజాల స్థలం, మన అవుసరాల నిమిత్తం,  తప్పనిసరి పరిస్థితులలో కొనవలసి వచ్చింది.

అందుకు సహకరించిన ఆ స్థల యజమానులు వీరబ్రమ్మ రాములు గారి కుటుంబ సబ్యులకు & ఈదంపల్లి శ్రీనివాస్ గారి కుటుంబసబ్యులకు జ్ఞానసరస్వతి సేవాసమితి తరపున ధన్యవాదాలు.

28.06.2018, గురువారం  మూలానక్షత్రం రోజున ఆయా కుటుంబాల సబ్యులు, నందివనపర్తి గ్రామ సర్పంచ్ గారు, జ్ఞానసరస్వతి సేవాసమితి ఫౌండర్ & మేనేజింగ్  ట్రస్టీ తో పాటు, సేవాసమితి వివిద మండలిల సబ్యుల సమక్ష్యంలో  ""జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్"" పేరున ఆస్తి మార్పిడి జరిగింది.

ఒక నిరంతర  మహాయజ్ఞంలా కొనసాగుతున్న  ఈ ఆలయ అభివృద్ది & కార్యక్రమాలకు సహకరిస్తున్న ఆలయ శ్రేయోభిలాషులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని  కోరుతూ  ట్రస్ట్ తరపున దన్యవాదాలు.

బోలో సరస్వతి మాతా కి జై.

౼౼౼౼౼౼౼౽౼౼౼౼౼౼
సమాజ హితంకోరి నిజాయితీగా, నిస్వార్థంగా ఎవరు ఏ ఉద్యమం/కార్యం చేసినా ఆ ప్రకృతి తప్పక సహకరిస్తుంది అంటారు.. మనం చేసే ఆ పనిలో ఆ రెండు ధర్మాలు కాపాడుకోవడమే మన కర్తవ్యం..

By.
Gnana Saraswathi sevasamithi Trust.

SANKALP BHAVAN

శ్రీ మాత్రేనమహ....

బోలో సరస్వతీ మాతాకి జై..

అక్షయమైన అక్షరజ్ఞానం చిన్నారులకు అందిస్తూ...
ఏ తారతమ్యం చూపని ఆ చదువులమ్మ చల్లని ఆశీస్సులు అతి బీదలకు కూడా చేరవేయాలనీ...

అక్షర స్వీకారం జరిగిన నాడే ఆ పసిబిడ్డ జీవితానికి మెండైన భరోసా కలగేలా తల్లిదండ్రు మరియు పెద్దల సంకల్పం జరగానీ...

ఆ""వేడుకకు వేదికగా"" నిలవాలని నిర్మించతలపెట్టిన "సంకల్ప భవన్" నిర్మాణం పనులు ప్రారంభం కావడం శుభసూచకం.

ఈ మహాకార్యంలో ప్రత్యక్ష బాగస్థులకు,  సహృదయ దాతలకు, సేవా తత్పరులకు  మరియు సహకరిస్తున్న వారందరికీ "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్" తరపున ప్రత్యేక ధన్యవాదాలు.

( ఆలయ అభివృద్ది పనులలో అందరం బాగస్వాములం అవుదాం _ మన వంతు సహకారం అందిద్దాం)..

~ జ్ఞానసరస్వతి సేవాసమితి.
(జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి)